Random Video

అనుష్క-విరాట్ ఇల్లు ఎంత బావుందో.. చూస్తే షాక్ అవుతారు ! | Filmibeat Telugu

2017-12-14 4 Dailymotion

After a private yet beautiful wedding in Italy, newlyweds Anushka Sharma and Virat Kohli might move into a luxury pad in Omkar Realtors and Developers residential project Omkar '1973'.

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. వివాహం అనంతరం విరుష్క జంట ముంబైలోని ఖరీదైన లగ్జరీ అపార్టుమెంటులో కాపురం పెట్టబోతున్నారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలోని సముద్ర తీరంలో ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ రెసిడెన్సియల్ ప్రాజెక్ట్ ఓంకార్ 1973లో ఈ అపార్టుమెంట్ ఉంది. ఈ ప్రాజెక్టులో మొత్తం మూడు టవర్స్ ఉండగా టవర్ 'సి'లో అనుష్క, కోహ్లి ఫ్లాట్ ఉంది. సముద్రం వైపు ఫేసింగ్ ఉండటం దీని ప్రత్యేకత.
ముంబై వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. 2016లో కోహ్లి దీన్ని రూ. 34 కోట్లకు కొనుగోలు చేశారట.ఈ అపార్టుమెంటులోని 35వ అంతస్తులో కోహ్లి కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ ఉంది. 4 బెడ్రూంలు కలిగిన ఈ ఫ్లాట్ నుండి.....సముద్ర తీరం ఎంతో సుందరంగా కనిపిస్తుందని తెలుస్తోంది.
ఇదే అపార్టుమెంటులోని 29వ అంతస్తులో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కూడా ఒక ఫ్లాట్ ఉందట.
ఓకాంర్ ప్రాజెక్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ.... మా ప్రాజెక్టులో విరాట్ ఫ్లాటు కొన్న విషయం తెలియగానే.... చాలా మంది ఇందులో ఫ్లాట్స్ కొనేందుకు ముందుకు వచ్చారని, విరాట్ కు అంత ఫాలోయింగ్ ఉందని తెలిపారు.